సూపర్ హిట్ టాక్.. కానీ ఆ డిజాస్టర్ మూవీని దాటని విరుపాక్ష?
ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఏపీ తెలంగాణలో 4.79 కోట్ల షేర్లు విరూపాక్ష కలెక్ట్ చేసినట్లు సమాచారం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్లో 1.2 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.
ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ను విరుపాక్ష సినిమా మొదటి రోజు కలెక్ట్ చేయగలిగింది అని చెప్పాలి. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 11.85 కోట్లు వసూలు చేసింది. అయితే థియేటర్ బిజినెస్ 22.20 కోట్లు కాగా.. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ మూవీ సాయి ధరంతేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. అయితే సాయి ధరంతేజ్ డిజాస్టర్ సినిమా వసూళ్లను మాత్రం దాటలేకపోయింది. తేజ్ కెరియర్లో డిజాస్టర్ గా నిలిచిన విన్నర్ మొదటి రోజు 6.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు విరుపాక్ష ఈ రికార్డును బ్రేక్ చేయకపోవడం గమనార్హం. కానీ వీకెండ్ కావడంతో ఇక ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.