ప్రస్తుతం
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో
శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో
మూవీ లలో నటించి వాటిలో అనేక
మూవీ లతో అద్భుతమైన విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని
కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశారు. అందులో
వరుణ్ డాక్టర్ ... కాలేజ్ డాన్ సినిమాలు వరసగా
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు
మూవీ ల విజయాలతో
శివ కార్తికేయన్ కు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది.
ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ
హీరో జాతి రత్నాలు
మూవీ దర్శకుడు అయినటువంటి అనుదీప్ కే
వి దర్శకత్వంలో రూపొందిన
ప్రిన్స్ అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
హీరో మా వీరన్ అనే
తమిళ మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని తెలుగు లో
మహా వీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 11 వ తేదీన ఈ
మూవీ ని విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రక టించింది. ఈ సినిమాకు అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ ని ఈ దర్శకుడు ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ
మూవీ పై
తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.