జబర్దస్త్ చలాకి చంటి కి గుండెపోటు..!!
అయితే గత కొద్దిరోజుల క్రితం నుంచి చలాకి చాటి ఎక్కడా కనిపించకపోవడంతో అభిమానులు చలాకి చంటికి ఏమైందంటే సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేయడం జరిగింది. దీంతో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చలాకి చంటి కి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చలాకి చంటికి ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్న కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని సమాచారం ఇటీవల చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా షోలలో కనిపించలేదు.
అయితే ఈ విషయం తెలిసిన చంటి అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ కూడా చాలా చలాకీగా ఉండే చలాకి చంటి కి ఇలా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అందరికీ ఈ విషయం కాస్త షాకింగ్ అనిపించింది. ఒకవైపు సినిమాలను నటిస్తూనే మరొకవైపు బుల్లితెలపై పరిశోధనలు కనిపిస్తూ ఉండే చలాకి చంటి ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే షోకి హోస్టుగా కూడా చేశారు. ఈ కార్యక్రమం కూడా బాగానే కొనసాగిందని చెప్పవచ్చు. జబర్దస్త్ కంటే చలాకి చంటి వాళ్ళు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు ముఖ్యంగా నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో తనదైన స్టైల్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని చెప్పవచ్చు.