ఇక ఇప్పుడు
ఎన్టీఆర్ సినిమాలో ఈ
కోలీవుడ్ యంగ్
హీరో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపించే హరీష్
కళ్యాణ్ ని
ఎన్టీఆర్ లాంటి
మాస్ హీరో కి విలన్ గా తీసుకోవడం ఒక విధంగా ఇది
కొరటాల శివ కి పెద్ద సాహసమనే చెప్పాలి. మరి
ఎన్టీఆర్ మూవీలో హరీష్
కళ్యాణ్ విలనిజం ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. కాగా మరోవైపు తమిళంలో యంగ్
హీరో గా వరుస సినిమాలు చేస్తున్న హరీష్
కళ్యాణ్ మంచి నటుడు కాబట్టి
కొరటాల శివ అతనికి
ఎన్టీఆర్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఉండొచ్చు. విలన్ గా అయితే కాకపోవచ్చు అని అంటున్నారు. త్వరలోనే
మూవీ టీం ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చి అవకాశం ఉంది. ఇక సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ
సినిమా రూపొందుతోంది.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా
ఎన్టీఆర్ -
జాన్వి కపూర్ -
ప్రకాష్ రాజ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే
జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ
సినిమా కోసం ఏకంగా
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి కెన్నీ బేట్స్ పనిచేస్తుండడంతో.. ఈ సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్
హాలీవుడ్ తరహాలో ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. దీంతో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుదా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమవుతున్న ఈ
మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చేయడాది ఏప్రిల్ 5న వేసవి కానుకగా విడుదల కానుంది...!!