రూటు మార్చబోతున్న రవితేజ..!!

murali krishna
హీరో రవితేజ ఆయన సినిమాలు ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. నిజానికి రవితేజ కెరీర్ ఇప్పుడు అంత ఆశాజనకంగా అయితే లేదు. ఒక హిట్టు వస్తే..మూడు నాలుగు వరుస ఫ్లాప్ లు ఆయన్ను పలకరిస్తున్నాయట.. నిజానికి ఆయన ఎప్పటినుంచో స్టార్ హీరో. ఆయన ఇప్పుడు కొత్తగా నటుడిగా నిరూపించుకునేది ఏం లేదు. మాస్ మరియు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకు రవితేజ దగ్గరయ్యారు. కానీ.. ఇప్పుడు తను ఎంచుకునే కథలు వర్కవుట్ అంతగా కావడం లేదు. అందుకే.. రవితేజ రూట్ మార్చాలని అయితే నిర్ణయించుకున్నారట.

అందుకే.. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలో ప్రత్యేక పాత్రలో  కూడా నటించారు రవితేజ. ఈ మధ్య ఓ సినిమా వచ్చినా ఆ సినిమా అంతగా అయితే ఆడలేదు. అందుకే మూస ధోరణికి స్వస్తి పలికి సరికొత్త కథలకు ఓకే చెప్పేందుకు రవితేజ సిద్ధమయ్యారనీ తెలుస్తుంది.. ఇటీవల కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్.. రవితేజకు ఇటీవల ఓ కథ చెప్పారనీ తెలుస్తుంది.ఆ కథ పిచ్చ పిచ్చిగా నచ్చిందట రవితేజకు. అది ఓ కాలేజీ లెక్చరర్ పాత్ర అని. కాకపోతే ఎంతో డిఫరెంట్ గా ఉండటంతో రవితేజ ఓకే చెప్పినట్టు సమాచారం.. అందులో స్టూడెంట్ గా ఎవరైనా ఒక కుర్ర హీరోను తీసుకుంటారనీ తెలుస్తుంది.నిఖిల్ కానీ.. సిద్దు జొన్నలగడ్డ కానీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజది కాస్త కొత్త క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అలాంటి క్యారెక్టర్లు వస్తే చేయడానికి తాను సిద్ధం అని కూడా ప్రకటించారు రవితేజ. ఇటీవల తను హీరోగా వచ్చిన రావణాసుర సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా రూ.10 కోట్ల వరకు పెట్టాడట రవితేజ. ఆ సినిమా భారీ నష్టాలనీ తీసుకొచ్చింది. అందుకే.. ఇంకాస్త వెరైటీగా కథలను సెలెక్ట్ చేసుకొని ప్రయోగాలు చేసేందుకు రవితేజ సిద్ధమవుతున్నారనీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: