పెరిగిపోతున్న సుకుమార్ బ్రాండ్ ఇమేజ్ !

Seetha Sailaja
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సుకుమార్ శిష్యుల గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. కేవలం కొన్ని నెలల గ్యాప్ లో సుకుమార్ శిష్యుల సినిమాలు సాధించిన ఘనవిజయం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత ఏడాది చివరిలో విడుదలైన ‘18 పేజెస్’ మూవీకి డివైడ్ టాక్‌ వచ్చినప్పటికీ కలక్షన్స్ బాగా వచ్చి ఈసినిమాను ఓటీటీలో కూడ విపరీతంగా చూశారు.

సుకుమార్ ప్రియ శిష్యులలో ఒకడైన సూర్య ప్రతాప్ ఈమూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈనెలలోనే వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగ వ్రాసింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల పేరు మారుమ్రోగి పోతోంది. ఈసినిమా విడుదలై మూడు వారాలు గడవకుండానే లేటెస్ట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో కలక్షన్స్ పెరిగిపోతున్నాయి.

ఈసినిమాకు కూడ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్ సినిమా కెరియర్ లో ఈమూవీకి అత్యంత భారీ కలక్షన్స్ వస్తాయి అన్న అంచనాలు వస్తున్నాయి. ఈమూవీ ఈమధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడ విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ కంటే ఎక్కువగా ఈ మూవీ దర్శకుడు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సుకుమార్ శిష్యుల బ్రాండ్ వేల్యూ ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది.  

ఈసినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా పట్టు తప్పకుండా ఈసినిమా ప్రారంభం నుండి ఎక్కడా విసుకు అన్నది కనిపించకుండా ఈమూవీని ఒక దర్శకుడు డీల్ చేసిన విధానం పెద్ద దర్శకులు నేర్చుకోవలసిన పాఠంలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీలో స్టన్నింగ్ ట్విస్టులతో ఆశ్చర్యపరచడం ద్వారా కార్తీక్ తన బ్రాండ్ ఇమేజ్ ని చాటుకున్నాడు అంటూ ప్రశంసలు వస్తున్నాయి. దీనికితోడు సుకుమార్ ఈసినిమాకు అందించిన స్క్రీన్ ప్లే మరింత సక్సస్ కు చేరువ చేస్తూ సుకుమార్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత స్థాయికి తీసుకువెళుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: