శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని దంపతులు ..!!
ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాగార్జున మీడియా సమావేశం లో మాట్లాడారట . ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయన తన కొడుకుల సినిమాల గురించి కామెంట్ కూడా చేశారు.
నాగార్జున వారసులు గా నాగచైతన్య,అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరో లు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగర్జున మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఏడాది తర్వాత ఇలా స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అయితే తమ కొడుకులు నటించిన సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామని నాగార్జున వెల్లడించారట..ఇక ఈ సినిమాల కోసం అఖిల్ చైతన్య ఎంతో కష్టపడ్డారని వారి కష్టం మాత్రమే కాకుండా స్వామి వారి ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇక అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఈ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.. అదేవిధంగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా కూడా మే 12వ తేదీ విడుదల కానుందని తెలుస్తుంది.వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుందట.. ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించబోతున్నారు. ఈ సినిమాపై కూడా నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది..