సౌత్ సీనియర్ హీరోయిన్, చెన్నై బ్యూటీ త్రిష పెళ్లిపై వచ్చినన్ని రూమర్స్ ఏ హీరోయిన్ పై రాలేదనే చెప్పాలి. సుమారు పది సంవత్సరాలుగా త్రిష పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన తోటి హీరోయిన్లు చాలామంది ఇప్పటివరకు పెళ్లయి సెటిలైపోయారు. కానీ త్రిష మాత్రం అసలు పెళ్లి జోలికే వెళ్లడం లేదు. ఇన్నాళ్లు త్రిష ఎందుకు పెళ్లికి దూరంగా ఉంటుంది? అసలే త్రిష కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. గతంలో కొంతమంది సౌత్ హీరోలతో ప్రేమాయణం నడిపించిన త్రిష తాజాగా ఓ బిజినెస్ మాన్ ని లవ్ చేస్తోందట.
కొంతకాలంగా త్రిషకి ఓ బిజినెస్ మాన్ కి మధ్య నిజంగానే లవ్ స్టోరీ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిష పెళ్లి పై అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బిజినెస్ మాన్ తో త్రిష ప్రేమ వ్యవహారం ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉండగా.. కొంతమంది గాసిప్ రాయుళ్లు మాత్రం మళ్లీ త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో కథనాలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. నిజానికి త్రిష కి తన వృత్తిపై అంకిత భావం ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు తన పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి సినీ కెరీర్ పై దృష్టి పెడుతూ వచ్చింది. 40 పందుల వయసులో కూడా మేకప్ వేసుకుంటూ సినిమాలే తనకు లోకం అన్నట్లు వాటితోనే కాలక్షేపం చేస్తుంది.
త్రిష తో పాటే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, శ్రియ ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కన్నారు. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. కానీ త్రిష మాత్రం ఇంకా సోలో లైఫ్ నే లీడ్ చేస్తోంది. నిజానికి గత మూడు సంవత్సరాల నుంచి త్రిష ఓ మంచి సంబంధం కోసం చూస్తుందట. ఇప్పటివరకు ఏదీ కూడా సెట్ కావడం లేదు. అయితే రీసెంట్ గానే ఓ బిజినెస్ మాన్ తో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాబట్టి త్వరలోనే ఆ బిజినెస్ మాన్ తో త్రిష పెళ్లి ఉంటుందేమో చూడాలి. ఇక త్రిష తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్ని యన్ సెల్వన్ 2' లో హీరోయిన్ గా నటించింది. ఈ రోజు (అనగా ఏప్రిల్ 28న) విడుదలై న ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..!!