టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'NTR 30' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే ఈయన షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం తారక్ డిసెంబర్లో డేట్స్ కేటాయించారు. సుమారు మూడు నెలలపాటు వార్2 కి కాల్ షీట్స్ ఇచ్చాడు తారక్.
దాని తర్వాత కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశం తోనే ఈ మూవీ ని ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రజెంట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ కేజీఎఫ్ తరహాలోనే ఉండబోతోంది. పార్ట్ వన్ ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుంటే.. పార్ట్ 2 2025 లో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే మూవీ కాన్సెప్ట్ కే జి ఎఫ్, సలార్ సినిమాలను మించి ఉంటుందట.
ఎన్టీఆర్ ఇమేజ్ ని పాన్ వరల్డ్ లెవెల్ లో తాటిచెప్పేలా కథని రెడీ చేశారట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాకి కూడా రెండు భాగాలు గానే స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేశాడట డైరెక్టర్. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఫాన్స్ ఈ న్యూస్ విని ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా కేజిఎఫ్, సలార్ లను మించి ఉంటుందని తెలియడంతో ఇప్పటినుంచే ఈ ప్రాజెక్టు పై అంచనాలను పెంచేసుకుంటున్నారు అభిమానులు...!!