సమంత బర్త్డే కానుకగా "ఖుషి" మూవీ నుండి స్పెషల్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్  గార్జియస్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మొదటి మూవీ తోనే తెలుగు సినీ ప్రేమికులను ఫిదా చేసి అనేక టాలీవుడ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగి పోయింది.
 


ఇప్పటికి కూడా సమంత వరుస సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకుంటూ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత నటించిన శాకుంతలం అనే మూవీ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత "ఖుషి" అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తూ ఉండగా ... శివ నార్వన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు సమంత పుట్టిన రోజు సందర్భంగా ఖుషి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సమంత కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం సమంత కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో సమంత అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉంది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖుషి మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: