ఆ సినిమాలో పవర్ ఫుల్ పాత్రను వదులుకున్న నయనతార...!!
ఇక పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఐశ్వర్య రాయి కాదనే సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆమె చేతిలో ఏ పాత్ర ఉన్న అందులో జీవిస్తుంది ఐష్.మొదటి పార్టు లో కూడా ఆమె చాల అద్భుతంగా నటించింది. ఇక పార్ట్ 2 లో కూడా చక్కగా ఒదిగిలిపోయి నటించిందట ఐశ్వర్య.నిజానికి మల్టి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయినా మణిరత్నం కి ఐశ్వర్య రాయ్ మొదటి నుంచి లక్కీ హీరోయిన్. అయినా కూడా మొదట ఐశ్వర్య నటించిన పాత్ర కోసం వేరే హీరోయిన్ ని అయితే అనుకున్నారట.
కానీ రెండు భాగాలుగా రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి రావడం అనేది సదరు హీరోయిన్ కి సెట్ కాకపోవడం తో ఆ పాత్రకు ఐశ్వర్య అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నారట దర్శకుడు మణిరత్నం. ఇక మొదట భాగంలో ఐశ్వర్య పాత్ర కాస్త నెగటివ్ లుక్ ఉన్నట్టు కనిపించిన కూడా రెండవ భాగంలో ఆమె అసలైన క్యారెక్టర్ రివీల్ అవుతుందట . అయితే సినిమా లోని రెండు భాగాలు విడుదల అయినా తర్వాత ఆమె పాత్రలో మరొక హీరోయిన్ ని ఊహించుకోలేకపోతున్నారట అభిమానులు. నిజంగా ఆమె పాత్రకు ఐశ్యర్య చక్కగా న్యాయం చేసిందని చెప్పాలి.ఇంతకు ఐశ్వర్యా రాయ్ పాత్ర వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే నయనతార. ఆమె ఈ సినిమా తీసిన సమయంలో పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం తో ఉండటం వల్ల ఐశ్వర్య పాత్రను మిస్ చేసుకుందట.. అలాగే నయనతార జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు కూడా జరిగాయి ఈ మధ్య కాలంలోనే. ఆమె పొన్నియన్ సెల్వన్ సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధ పడిన సరైన టైం లో పెళ్లి చేసుకొని ఇద్దరు కుమారులకు తల్లి కూడా అయ్యిది.