టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య రాయ్..!?

Anilkumar
పోటీ తత్వం అన్నది ప్రతి వ్యవస్థలను ప్రతి వ్యక్తులను ఉంటుంది.అభివృద్ధి చెందాలి అంటే ఇది ప్రధానంగా కావలసింది  ఇక అలాంటి ఒక పోటీ తత్వం సినీ ఇండస్ట్రీలో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి ఎప్పుడు పోటీ ఉండనే ఉంటుంది. అందుకే ఆయా ఇండస్ట్రీలకు చెందిన అభిమానులు ఎప్పుడూ ఈ పోటీల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇదే టాపిక్ పై మాజీ వరల్డ్ సుందరి ఐశ్వర్యరాయ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేసింది. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానాన్ని ఇచ్చింది. ఇటీవల దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్ కంటే బాగా పాపులర్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. 

దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ఎందుకు ఆమె స్పందిస్తూ నేనెప్పుడూ దక్షిణాది ఉత్తరాది అని వేరుగా చూడలేదు. ఏ సినిమా అయినా కూడా అదే భారతీయ సినిమానే సాధారణంగా ఒకచోట అవకాశం రాకపోతే మరొకచోట ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. ఒకవేళ అక్కడ కూడా రాకపోతే మరొక ఇండస్ట్రీలో వస్తుంది.  కళాకారులకు ఎక్కడైనా ఒకే విధంగా గౌరవం ఉంటుంది. ప్రతి సినిమా నుండి ఏదో ఒక విషయాన్ని కచ్చితంగా నేర్చుకోవచ్చు సౌత్ లో కూడా నాకు పెద్ద దర్శకులతో సినిమా చేసే అవకాశాలు వచ్చాయి.

మణిరత్నం శంకర్ ఇలా పెద్ద దర్శకుల సినిమాల్లో నేను నటించాను ఏ సినిమా విజయం సాధించినా కూడా అది భారతీయ సినిమా విజయంగానే నేను భావిస్తాను అంటూ  చెప్పుకొచ్చింది ఐశ్వర్యరాయ్. దీనిపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇంత తెలివిగా సమాధానం చెప్పడం మీకు మాత్రమే సాధ్యం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇదిలావుంటే ఇక ఐశ్వర్యరాయ్ కీలకపాత్రలో నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ఆమె నందిని పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ ఇలాంటి ఒక మంచి పాత్రలు నటించడం తన అదృష్టం అంటూ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: