అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' అఖిల్ తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ఈ మూవీ నిన్న (ఏప్రిల్ 28) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను విడుదలై డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. కిక్, రేసుగుర్రం, ధ్రువ లాంటి సినిమాలు తెరకెక్కించిన సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్ చేతిలో అఖిల్ పడ్డప్పుడు కచ్చితంగా ఈ దర్శకుడు అఖిల్ ని స్టార్ లీగ్ లో కూర్చోబెడతారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఏజెంట్ షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి మరియు నిర్మాత అనిల్ సుంకరకి మధ్య గొడవలు రావడం.. దాంతో సురేందర్ రెడ్డి సినిమా మధ్యలోనే వదిలి వెళ్ళిపోవడం వల్ల..
ఈ మూవీ కథ రాసిన రచయిత వక్కంతం వంశీ సినిమాని డైరెక్ట్ చేశాడట. అందుకే ఏజెంట్ రిజల్ట్ మొత్తం తారుమారు అయిపోయింది. కానీ మూవీ టైటిల్స్ పడేటప్పుడు డైరెక్టర్ పేరు సురేందర్ రెడ్డి అని పడడం వల్ల ఈ సినిమా ప్లాప్ బాధ్యత మొత్తం సురేందర్ రెడ్డి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విధంగా ఏజెంట్ రిజల్ట్ తో సురేందర్ రెడ్డి కెరీర్ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అయితే ఏజెంట్ లాంటి డిజాస్టర్ నుండి ఓ స్టార్ హీరో ముందుగానే తప్పించుకున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏజెంట్ మూవీ ముందుగా రామ్ చరణ్ తో తీద్దామని అనుకున్నారట.
గతంలో రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే అప్పటికే అతను ఒప్పుకున్న కమిట్మెంట్స్ ఇప్పట్లో పూర్తయ్యే చాన్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని అఖిల్ కి ఇచ్చేసాడట చరణ్. ఇక అఖిల్ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా మళ్లీ అతనికి నిరాశనే మిగిల్చింది. మొత్తం మీద రామ్ చరణ్ మాత్రం అదృష్టవశాత్తు ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. సుమారు 80 కోట్లతో ఏజెంట్ మూవీని నిర్మించారు. కానీ బయట టాక్ చూస్తుంటే ఈ సినిమా భారీ నష్టాలను మూట గట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి...!!