అఖిల్ తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్..!!
ప్రభాస్ సాహో టైం లో సుజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ కుమార్ డైరెక్షన్లో అఖిల్ తన తదుపరి చిత్రం ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. శ్రీదేవి కూడా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.తన తల్లి బాటలోనే ఈమె కూడా తెలుగులో సక్సెస్ అవ్వాలని పలు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది.
ఇప్పటికే ఎన్టీఆర్ 30వ సినిమాలు హీరోయిన్గా చేస్తోంది. దీంతో టాలీవుడ్ లో వరుస సినిమాలను లైనప్ చేస్తూ ఉంటోంది జాన్వీ కపూర్. శ్రీదేవి ఏఎన్ఆర్ నాగార్జునతో కలిసి నటించింది .ఇప్పుడు ఈమె కూతురు అఖిల్ కి జోడిగా నటిస్తోంది. అఖిలతో జాన్వీ రొమాన్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ అయిన అఖిల్ తన నెక్స్ట్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు సమాచారం.యువి క్రియేషన్ బ్యానర్లో ఈ ప్రాజెక్టుని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.