HBD: అజిత్ అభిమానులకు డబుల్ ధమాకా..!!
ఈ ఏడాది భారీ స్థాయిలో విడుదలైన తెగింపు సినిమా బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ రోజున అజిత్ బర్తడే సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ తన తదుపరి సినిమాను మగ్గిజ్ తిరుమేనితో చేయబోతున్నారు. తడం, కలగ తాలైవాన్ వంటి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన ముగీజ్ ఇప్పుడు అజిత్‌తో తన తదుపరి చిత్రాన్ని చేస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి. అజిత్ బర్త్‌డే సందర్భంగా A-62 మూవీ టైటిల్‌ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు ఈ రోజున డబుల్ ధమాకే అన్నట్లుగా చెప్పవచ్చు.
గత కొంతకాలంగా అజిత్ బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో రెచ్చిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అజిత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఓటీటి లో మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏడాది ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారేమో అజిత్ చూడాలి మరి. ఏది ఏమైనా అది అభిమానులు ఈరోజు బర్త్‌డే సందర్భంగా పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి అజిత్ 62వ సినిమాకు సంబంధించి టీజర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.