బాలయ్య-బోయపాటి సినిమాకు ముహూర్తం కుదిరింది.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలో ఎంత బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ సినిమా అయితే ఏకంగా 100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని వారి అభిమానులు భావిస్తూ ఉంటారు. అయితే వివిధ కాంబినేషన్లో నాలుగో సినిమా కూడా రాబోతుంది అన్న సమాచారం వినబడుతుంది. గతంలోనే అంటే అఖండ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లోనే బాలకృష్ణతో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు బోయపాటి ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అంటే జూన్ 10న ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన

 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరిలో ఆ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే నాలుగో సినిమాపై మరింత స్పష్టత వస్తుంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: