టి సిరీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరక్కెక్కిన సినిమాల్లో
ఆది పురష్
సినిమా కూడా ఒకటి. ఈ
సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించడం జరుగుతుంది. ఇక ఇప్పుడిప్పుడే ఈ సేమాపై పాజిటివ్ టాక్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కానుంది.మే 4వ తేదీన లేదా 17వ తేదీన ఈ
సినిమా ట్రైలర్ విడుదల కానని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చేయనున్నారు. అయితే తాజాగా
ఆది పురుష
డైరెక్టర్ ఓం రత్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే
ఆది పురుష
మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన తెలియజేశారు. ఈ
సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమాపై ఖచ్చితంగా అందరిలోనూ అంచనాలు మరింత పెరిగిపోతాయని కూడా ఆయన తెలియజేశారు. చిత్ర బృందం ఈ
సినిమా రిసల్ట్ పై చాలా నమ్మకంతో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాతో ఖచ్చితంగా
బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తామని ఆయన అభిప్రాయాన్ని తెలియపరిచాడు. మరో 45 రోజుల్లో ఈ
సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది.
సాహో, రాదే
శ్యామ్ సినిమాల తర్వాత
ప్రభాస్ నటిస్తున్న
సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా
ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో
కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ
సినిమా గనక
సక్సెస్ సాధిస్తే
ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
బాహుబలి 2
సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్
ప్రభాస్ ఖాతాలో లేదు అనే చెప్పాలి. ఈ
సినిమా గనక మంచి విజయాన్ని అందుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అని
ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు..!!