డేరింగ్ అండ్ డాష్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో
మూవీ లకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో
మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు
సినిమా ఇండ స్ట్రీలో ఇప్పటికీ కూడా టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ దర్శకుడు విజయ్
దేవరకొండ హీరోగా
అనన్య పాండే హీరోయిన్ గ రూపొందినటువంటి లైగర్ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్
మూవీ కి దర్శకత్వం వహించాడు.
భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా మూవీ గా రూపొందిన ఈ
సినిమా భారీ అంచనాలను తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషల్లో విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే లైగర్
మూవీ ఫెయిల్యూర్ తర్వాత
పూరి జగన్నాథ్ ...
రామ్ పోతినేని తో ఒక
మూవీ చేయబోతున్నట్లు ... ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఈస్మార్ట్
శంకర్ మూవీ రూపొంది
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి
మూవీ ఈస్మార్ట్
శంకర్ మూవీకి సిక్వల్ గా ఉండబోతుంది అని కూడా వార్తలు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా
పూరి జగన్నాథ్ నెక్స్ట్
మూవీ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...
పూరి జగన్నాథ్ తన నెక్స్ట్
మూవీ ని
రామ్ తో కాకుండా నందమూరి నటసింహం
బాలకృష్ణ తో చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు
పూరి జగన్నాథ్ ...
బాలకృష్ణ కాంబినేషన్ లో
పైసా వసూల్ అనే
మూవీ రూపొందింది.