ఆది పురుష్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..?
షూటింగ్ సమయంలో ఈ సినిమా పైన ఉన్న అంచనాలు టీజర్ విడుదల చేశాక ఒక్కసారిగా ఈ సినిమా పైన ట్రోల్ చేయడం జరిగింది.. టీజర్ లో గ్రాఫిక్స్ నాసికంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు విపరీతంగా చేయడం జరిగింది.అయితే వీటన్నిటిని చిత్ర యూనిట్ సరిచేసి మరి అప్డేట్ తో ఒక్కసారిగా ట్రోలింగ్లకు చెక్ పెట్టేలా చేసింది. తాజాగా ఆది పురుష్ నుంచి ప్రభాస్ లుక్ సీత లుక్ తెగ వైరల్ గా మారుతున్నాయి.ఆడియన్స్ కూడా వీటికి ఫిదా అవుతున్నారు.
మొన్నటివరకు ఈ చిత్రం పైన నెగటివ్ టాక్ వినిపించిన ఒక్కసారిగా మంచి బజ్ ఏర్పడుతోంది. దీంతో ఈ చిత్రం విడుదల పైన అందరి దృష్టి పడుతోంది .జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చాలా వేగవంతం చేస్తోంది.. వరుస అప్డేట్లు కూడా విడుదల చేస్తూ వస్తోంది. దీంతో ఈ చిత్రం విడుదల పైన అందరి దృష్టి పడింది. జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చాలా వేగవంతం చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మే 9 వ తేదీన ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం సుమారుగా 3 నిమిషాల పాటు ఈ సినిమా ట్రైలర్ ఉండబోతోంది.