శంకర్ దాదా సినిమాలో ఈ బుడ్డోడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో తెలుసా?

praveen
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆకట్టుకున్న ఎంతోమంది ఇక ఇప్పుడు పెరిగి పెద్దయి అదే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇక ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది.



 చిరంజీవి హాస్పిటల్లో ఉన్న సమయంలో ఎలాంటి చలనం లేకుండా ఒక వీల్ చైర్ పై ఉండే బాలుడి పాత్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి అనే అందమైన పేరుతో అంతకంటే ముద్దుగా ఉండే మొహంతో అందరిని ఆకట్టుకున్నాడు. డైలాగులు లేకపోయినా ఇక కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రలో నటించాడు ఆ బుడ్డోడు. శంకర్ దాదాలో డైలాగ్ లేకుండానే సినిమాను నడిపించిన బుడ్డోడు ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బడా హీరో అన్న విషయం కొంతమందికి తెలియదు. ఆ హీరో ఎవరో కాదు చిరంజీవి చిన్న మేనల్లుడు అయిన వైష్ణవ తేజ్.


 అదేనండి మన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై హిట్టు కొట్టాడు వైష్ణవ్ తేజ్. అప్పట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మామయ్యతో కలిసి నటించాడు. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం.. ఇక ఆ తర్వాత రంగ రంగ వైభవంగా అనే సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.  ఇక ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే కేవలం చిరంజీవి సినిమాల్లో మాత్రమే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమాలో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ పాత్రలోను నటించాడు. అదే సమయంలో పంజా సినిమాలో నటించి పంజా వైష్ణవ్ తేజ్ గా పేరు సంపాదించుకున్నాడు ఈ మెగా మేనల్లుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: