ఎంతమందికి ముద్దు పెట్టానో గుర్తులేదు : నాగచైతన్య

praveen
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి కాస్తో కూస్తో రాణిస్తున్నాడు అంటే అది నాగచైతన్య అని చెప్పాలి. ఇక వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలని అందుకుంటూ ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు కస్టడీ అనే ఒక వైవిద్యమైన  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు అని చెప్పాలి.

 కోలీవుడ్ సీనియర్ యాక్టర్  అరవిందస్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుండగా.. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రమోషన్స్ లో భాగంగా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల నాగచైతన్య సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

 ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబర్ ఇర్ఫాన్ తో డేర్ అండ్ ట్రూత్ అనే సరదా సెగ్మెంట్లో పాల్గొన్నాడు చైతన్య. ఇప్పటివరకు మీరు ఎంతమందికి ముద్దు పెట్టారు అంటూ ఇర్ఫాన్ ప్రశ్నించగా.. నాగచైతన్య సిగ్గుపడుతూ ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాకు తెలియదు.. ఆ లెక్క మరిచిపోయాను. సాధారణంగా సినిమాలోనే చాలా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. వాటిని నేను ఎలా గుర్తు పెట్టుకోగలను. అయినా ఇదంతా పబ్లిక్ కు తెలిసిందే కదా.. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. అయినప్పటికీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను ఇబ్బందుల్లో పడతానేమో అంటూ నవ్వుకున్నాడు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: