సమంతా దారిలో కాజల్ అగర్వాల్.. సక్సెస్ అవుతుందా..?
అంతేకాదు తమిళ్లో కూడా సినిమాలు చేసి.. మంచి పేరు సంపాదించుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే 2020లో గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న ఈమె 2022 ఏప్రిల్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది కాజల్ అగర్వాల్. ఈ నేపథ్యంలోనే ఈమె సమంత లాగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే యశోద, శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో యశోద సినిమా సక్సెస్ అవ్వగా శాకుంతలం పూర్తి డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ఈమె దారిలోనే కాజల్ అగర్వాల్ కూడా నడుస్తోందని సమాచారం. తెలుగులో ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి సమంత దారిలోనే పయనిస్తున్న కాజల్ అగర్వాల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఆమె సక్సెస్ అనేది ఎంచుకునే సబ్జెక్టు పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.