మళ్లీ సమంత మెడలో తాళి..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి పనిచేసినా కూడా ఎక్కువగా మీడియా ఫోకస్ చేస్తూ ఉంటుంది.. భర్త నాగ చైతన్య నుంచీ విడిపోయినప్పుడు మయోసిటీసీ వ్యాధిన దారిన పడ్డ సంగతి తెలిసిందే.. దీంతో సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. సమంత ఏదైనా పోస్ట్ పెట్టినా.. స్టేటస్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా రాద్దాంతం చేస్తూ వచ్చారు.. తాజాగా సమంత బర్త్డే సందర్భంగా ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది

అయితే ఈ పోస్టర్లో సమంత క్యాజువల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ ఒక చిన్న స్మైల్ తో వున్న పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో సమంత వర్కింగ్ ఉమెన్ గా కనిపిస్తోంది.  మెడలో మంగళసూత్రం ఆడియన్స్ను మరింత అబ్జర్వ్ అయ్యేలా చేస్తోంది. సమంత మెడలో మంగళసూత్రం నాగచైతన్య తో విడిపోయినా  కూడా సమంత మెడలో ఇంకా మంగళసూత్రం ఉంచుకుందా అంటూ  పలువురు అభిమానులు , నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. చైతూ తో సమంత డివోర్స్ తీసుకొని రెండేళ్లు అవుతోంది. కానీ ఇద్దరు కలిసి ఉండడం కుదరకపోయినా.. ఇప్పటికీ ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ వేరు.. ప్రొఫెషనల్ లైఫ్ వేరు.. వివాహమైన హీరోయిన్ అయినా సరే షూటింగ్ సమయాలలో మంగళసూత్రం తీసి షూటింగ్ చేస్తూ ఉంటారు కానీ అది వృత్తిరీత్యా చేయక తప్పదు.. సమంత గతంలో నాగచైతన్యతో డివోర్స్ తీసుకుంది. ఈ మధ్య ఆమె బయటకు వచ్చినప్పుడు కూడా మెడలో ఎలాంటి తాళి కూడా కనిపించలేదు కానీ.. ఖుషి సినిమా పోస్టర్లో సమంత మెడలో తాళిబొట్టును చూసి ఆమె నాగచైతన్యను ఇంకా మర్చిపోలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ దూరమైనప్పటికీ కూడా కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెడుతూ ఉన్నారు. మరి అలాంటి సమంత మెడలో తాలిని చూసి చైతూ కోసమే ఇంత హడావిడి చేయడం ఆమె అభిమానులను హర్ట్ చేసేలా కనిపిస్తోంది. మరి ఇది సినిమా కోసమా లేకపోతే ఎలా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: