రివ్యూ: రామ బాణంతో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్టు కొట్టాడా..!!
భారీ అంచనాల మధ్య ఈ రోజున ఈ సినిమా విడుదల అయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం రామబాణం ఈ సినిమా యాక్టర్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు గోపీచంద్ మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో ఒకసారి చూద్దాం.
రామబాణం సినిమా యావరేజ్ టాక్ ను దక్కించుకుంది.. కథ పాతది అయినప్పటికీ డైరెక్టర్ చూపించడం విషయంలో కొత్తగా చూపించారని పలువురు నేటిజెన్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ డింపుల్ హయాతి అందాలు ఈ సినిమాకి ప్లస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమానే కాకుండా కామెడీ ,యాక్షన్ ,మాస్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది. క్లాస్ మాస్ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చుతుందని పలువురు అభిమానులు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆకట్టుకున్న ఈ సినిమా మొత్తానికి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. గోపీచంద్ కూడా ఎట్టకేలకు కాస్త ఈ సినిమాతో ఫ్లాపుల నుంచి బయటపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ మేరకు మొదటి రోజు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.