కళ్యాణ్ రామ్ హీరో గా తేజ దర్శకత్వం లో రూపొందినటు వంటి లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . లక్ష్మీ కళ్యాణం మూవీ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న కాజల్ అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది.
ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ వివాహం చేసుకుంది . అలాగే ఒక పండంటి బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. వివాహం అయ్యి ఒక బిడ్డకు జన్మన ఇచ్చిన తర్వాత కూడా కాజల్ కు వరస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి . అందులో భాగంగా ప్రస్తుతం కాజల్ ... లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది .
ఈ మూవీ తో పాటు పలు మూవీ లలో కూడా కాజల్ నటిస్తోంది. కాజల్ ప్రస్తుతం తెలుగు లో బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . ఇది ఇలా ఉంటే కాజల్ మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ తెలుగులో నటించబోయే తదుపరి సినిమా లేడీ ఓరియంటెడ్ జోనర్ కు సంబంధించిన సినిమాగా తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చి అవకాశం ఉన్నట్లు సమాచారం.