'పుష్ప2' లో నిహారిక ఏ పాత్ర చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంతటి సంచలనాన్నను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా పుష్ప 2 కూడా త్వరలోనే రాబోతుంది. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతుంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మీ అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. 

మరి ముఖ్యంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మొదటి పార్ట్ లో ఊహించని విధంగా అల్లు అర్జున్ నటన ఉంది. ఇక పార్ట్ 2 లో అల్లు అర్జున్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో చూడడానికి ఆయన అభిమానులు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షేరవేగంగా జరుగుతుంది. పార్ట్ టూ కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 40 శాతానికి పైగానే పూర్తయినట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూనే ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా ఈ సినిమాలో కీలకపాత్రలో ఫలానా వాళ్లు నటిస్తున్నారన్న వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది పేర్లు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా నటించబోతున్నట్లుగా తాజాగా ఒక వార్త అయితే లీకై వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో నిహారిక కొణిదెల ఒక ముఖ్యమైన గిరిజన యువతి పాత్రలో నటిస్తుందన్న వార్త లీక్ అయింది. అంతేకాదు ఇందులో నిహారిక ఊహించని లుక్ లో కనిపించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే మొదటగా ఈ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించారు. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో  నిహారిక చేయడానికి ఒప్పుకుంది.దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: