సినిమాల కోసం మొదటిసారి అలాంటి ప్రయోగం చేయనున్న వరుణ్ తేజ్..!?

Anilkumar
మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోనీ పిక్చర్స్ సంస్థ ఏవియేషన్ నేపథ్యంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నవారు. తర్వాత మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫలానా ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసాడట వరుణ్ తేజ్.

80స్ నేపథ్యంలో సాగే కథలో నటించబోతున్నారట వరుణ్ తేజ్ .ఈ సినిమాలో  తన పాత్ర కోసం పూర్తిగా మారబోతున్నాడట వరుణ్ తేజ్. తన కొరియర్ లోనే ఒక కొత్త ఛాలెంజ్ గా ఈ సినిమాను తీసుకున్నాడట. అప్పట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం నుండి తాజాగా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాల టైపులో చాలా రష్టిక్ గా అత్యంత సహజంగా ఈ సినిమా ఉండబోతుందట. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఏదో ఒక సినిమా పూర్తి చేసి కరుణకుమార్ స్క్రిప్ట్ పై ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఎఫ్ త్రీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ ఆ సినిమా తర్వాత మళ్లీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. గని సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుణ్ తేజ్ కెరియర్ లోని ఈ సినిమా వెయ్యెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్ .అనంతరం  మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు .తాజాగా ఇప్పుడు ఈ రెండు సినిమాలు చేస్తూ బిజీ గా మారాడు వరుణ్ తేజ్ .ఎఫ్ త్రి సినిమా తర్వాత హిట్టు లేని ఈ హీరో ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాతో నైనా హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: