అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తాను నటించిన 'కస్టడీ'మూవీ ని ప్రమోట్ చేయడానికి వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ముఖ్యంగా తెలుగు మీడియాతో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన కస్టడీ మూవీలో చైతు ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మే12 శుక్రవారం ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చైతు పలు ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కస్టడి ప్రమోషన్స్ లో చైతు.. సమంత మీద శోభితో వస్తున్న రూమర్లపై పరోక్షంగా స్పందించాడు. అయితే తాజాగా డైరెక్టర్ పరశురాం అలాగే థాంక్యూ మూవీ పై చైతు చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో మూవీ ప్రమోషన్స్ పై స్పందించాడు చైతు. "సినిమా కోసం కాలేజీలు తిరిగి ఈవెంట్లు పెట్టి ప్రమోషన్ చేయడం వల్ల లాభం లేదు. సినిమాలో కంటెంట్ ఉండాలి. టీజర్, ట్రైలర్ బాగుండాలి అని చెప్పాడు. ఈ క్రమంలోనే థాంక్యూ మూవీ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.' థాంక్యూ మూవీ కథ అందరికీ నచ్చే తీసుకున్నాం. విక్రమ్, నేను, దిల్ రాజు కలిసే కథను ఓకే చేసాం.
కథ విన్నప్పుడు బాగానే అనిపించింది. కానీ మేకింగ్ లో కాస్త తేడా కొట్టింది. ఎడిటింగ్ టేబుల్ లోనే సినిమా పోతుందని అర్థమైంది. ఎడిటింగ్ టేబుల్ మీదే నాకు డౌట్స్ వచ్చాయి. సినిమా పోతుందని తెలిసి కూడా ప్రమోషన్ చేయడం కష్టం. కానీ సినిమా చూసాం. అర్థమైంది. కానీ బయటికి అలా చెప్పలేం. కోట్లు పెట్టి తీసిన సినిమాను బాలేదని మేము చేతులు దులుపుకోలేం కదా? చివరి వరకు అందరం కలిసి సినిమాను నడిపించాలని చూస్తాం" అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. దీంతో చైతు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి...!!