'భోళాశంకర్' రీమేక్ మూవీ కాదా..?

Anilkumar
వాల్తేరు వీరయ్య వంటి బిగ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కి ఇది అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోల్కతాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి నటించిన 'చూడాలని ఉంది' సినిమాలోని యమహానగరి అంటూ సాగే పాటను ఈ మూవీలో రీమిక్స్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పేరుకే ఇది తమిళ వేదాలమ్ అయినా.. దర్శకుడు మెహర్ రమేష్ ఈ రీమేక్ ని పూర్తిగా మార్చేసాడట. 

ఇప్పటికే మేహర్ రమేష్ బోలా శంకర్ లో చాలా మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత ఈ సినిమాకి మరిన్ని మార్పులు చేయడంతో బోలాశంకర్ కథ మొత్తం మారిపోయి దాదాపు కొత్త కథలాగా తయారైందట. దీన్ని బట్టి భోళా శంకర్ రీమేక్ మూవీ అయితే కాదని.. ఇది సరికొత్త కథాంశంతో రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. నిజానికి అజిత్ నటించిన వేదాలమ్ మూవీ ని మొదటగా పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా అది పవన్ కళ్యాణ్ నుంచి మెగాస్టార్ చేతికి వచ్చింది. వేదాళం సినిమా చూసిన చిరు స్వయంగా మెహర్ రమేష్ ని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు.

మెహర్ రమేష్ ఓ కమర్షియల్ హిట్ సినిమా తీసి చాలా చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా చిరంజీవి మెహర్ రమేష్ పై ఉన్న నమ్మకంతో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. అందుకే మెహర్ రమేష్ బోలా శంకర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ముఖ్యంగా మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లు తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో అన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: