ఆ వార్త నన్ను చాలా బాధపెట్టింది : నాగ చైతన్య
చైతన్య మాట్లాడుతూ మేము విడిపోయి రెండేళ్లు అవుతుందని చట్టప్రకారం విడాకులు తీసుకుని సంవత్సరం అయితే అవుతోందని తెలిపారు. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసిందని చైతన్య అన్నారు. ప్రస్తుతం మేము మా జీవితాలలో ముందుకు సాగుతున్నామని లైఫ్ లోని ప్రతి దశను కూడా గౌరవిస్తున్నానని చైతన్య చెప్పుకొచ్చారు.
సమంత మంచి మనిషి అని ఆమె ఎల్లప్పుడూ సంతోషం గా ఉండాలని చైతన్య కామెంట్లు చేశారట.నెట్టింట వైరల్ అయిన వార్తల వల్ల మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని కూడా చైతన్య చెప్పుకొచ్చారు. సమంతకు నాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేదనే విధంగా వార్తలు అయితే ప్రచారంలో కి వచ్చాయని చైతన్య అన్నారు. నా గతం తో ఏ మాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి మరీ వార్తలు రాయడం బాధ పెట్టిందని నాగచైతన్య కామెంట్లు చేశారు.
సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయం లో వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురవుతూ నే ఉంటాయని చైతన్య అన్నారు. మొదట్లో ఆ ప్రశ్నలను పట్టించుకోలేదని అలాంటి ప్రశ్నలకు నేను మౌనంగా ఉండేవాడినని నాగచైతన్య కామెంట్లు చేయడం విశేషం.అయితే ఇప్పటికీ నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని నాగచైతన్య అన్నారట.గాసిప్స్ ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అయితే అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
మేము ఎప్పుడూ విజయవంతమైన సినిమాలను తీయాలని అయితే అనుకుంటున్నామని ఆయన తెలిపారు. కెరీర్ లో ఎత్తు పల్లాలు కూడా సహజమని వాటిని దాటుకుంటూ కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నానని కూడా చైతన్య కామెంట్లు చేశారు.నాగ చైతన్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.