అలాంటి పాత్రలో కూడా చేయడానికి సిద్ధంగా వున్న శ్రీయ...!!
స్టార్ హీరోల కు తల్లి పాత్రల్లో కూడా నటించడాని కి ఆమెకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు సైతం ఆమె బెస్ట్ ఆప్షన్ గా అయితే నిలుస్తుండటం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతోంది.
ఇంటి బయటి కి రావాలన్నా పోరాటం చేయాల్సిందేనని శ్రియ చెప్పుకొచ్చారట.విభిన్నమైన కథలను ఆమె ఎంచుకుంటున్నారు. ఆమె నటించిన మ్యూజిక్ స్కూల్ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా థియేటర్లలో సమాచారం అందుతోంది. పీవీఆర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం.
శ్రియ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీ షూట్ కు వెళుతున్న సమయంలో ఇంటికి వెళ్లిన ఫీలింగ్ కూడా కలిగిందని అన్నారు. నాకు మంచి పేరెంట్స్ ఉన్నారని అందుకే అనుకున్నది సులువుగా చేస్తున్నానని శ్రియ చెప్పుకొచ్చారట.. నా బంధువుల్లో కొంతమంది ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోందని శ్రియ కామెంట్లు చేశారట.. ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత అలాంటి విషయాలను అర్థం చేసుకున్నానని కూడా శ్రియ తెలిపారు.
డైరెక్టర్ పాపారావు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఈ తరానికి మ్యూజిక్ స్కూల్ తరహా మూవీ అవసరమని కూడా ఆమె చెప్పుకొచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు, మ్యూజిక్ జీవితంలో భాగం కావాలనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో మరి చూడాలి. హీరోయిన్ శ్రియ పారితోషికం పరిమితంగా ఉండటం వల్లే ఆమెకు ఆఫర్లు కూడా పెరుగుతున్నాయని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. శ్రీయ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా వుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో శ్రీయ దూసుకుపోతుంది