షాక్: త్రిష బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో బిందు మాధవి..!!
తాజాగా ఈమె నటించిన న్యూసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఈనెల 12వ తేదీన ఆహాలో స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి చిత్ర బృందం ప్రమోషన్స్ చాలానే వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో నటినటులకు ఊహించిన విధంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రెస్మీట్లో నవదీప్ కు కూడా చాలా వింతైన ప్రశ్నలు ఎదురవ్వడం గమనార్హం. ముఖ్యంగా నవదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం పైన కూడా స్పందించడం జరిగింది.
ఇక ఇలాంటి సమయంలోనే హీరోయిన్ బిందు మాధవ్ గురించి ఒక ప్రశ్న ఎదురవు కాగా ..త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి అవి వాస్తవమేనా అని ప్రశ్నించగా.. అందుకు బిందు మాధవి అవన్నీ రూమర్స్ కాదని త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మనీ ఎంత తాను నిజంగానే డేటింగ్ లో ఉన్నానని తెలియజేసింది. కాకపోతే అది వేరువేరు సందర్భాలలో జరిగిందని తెలిపింది.ఓకే సమయంలో మేమిద్దరం డేటింగ్ లో లేమని తెలిపింది బిందు మాధవి. త్రిష బ్రేకప్ అయిన తర్వాత నాతో డేట్ చేశారని ఒప్పుకుంది. అయితే ఈ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకోవడానికి చూసి అందరూ షాక్ అవుతున్నారు.