5 రోజుల్లో "ఉగ్రం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 37 లక్షలు , యూ ఏ లో 30 లక్షలు , ఈస్ట్ లో 20 లక్షలు , వెస్టు లో 12 లక్షలు , గుంటూరు లో 20 లక్షలు ,  కృష్ణ లో 19 లక్షలు ,  నెల్లూరు లో 10 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ 25 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.63 కోట్ల షేర్ ... 5.75 కోట్ల గ్రాస్ కలక్షన్ లని వసూలు చేసింది.


వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కి 5.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 6.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ మరో 3.87 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: