తమిళ
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడు.గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ దర్శకుడు శింబు
హీరో గా రూపొందినటు వంటి మానాడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ
సినిమా భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. చాలా సంవత్సరాలుగా వరస అపజయాలతో డీలా పడిపోయిన శింబు ఈ
మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ
మూవీ ద్వారా వెంకట్ ప్రభు క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇలా మనాడు లాంటి భారీ విజయవంతమైన
సినిమా తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్
హీరో నాగ
చైతన్య తో "కస్టడీ" అనే
మూవీ ని రూపొందించాడు.
కృతి శెట్టి ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని మే 12 వ తేదీన తెలుగు ,
తమిళ భాషల్లో
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల సందర్భంగా తాజాగా ఈ
మూవీ గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ ... కస్టడీ
మూవీ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. అలాగే ఈ
మూవీ వేగవంతమైన స్క్రీన్ ప్లే తో సీట్ ఎడ్జ్
థ్రిల్లర్ గా కొనసాగుతోంది. తెలుగు మరియు
తమిళ భాష ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ
సినిమా ఉంటుంది. ఈ
మూవీ ని ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేస్తారు అని వెంకట్ ప్రభు తాజాగా చెప్పుకొచ్చాడు.