మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ పోయిన సంవత్సరం దర్శక ధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్"
మూవీ లోనూ
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య
మూవీ లోను నటించాడు. ఈ
మూవీ లలో "ఆర్ ఆర్ ఆర్"
మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించగా ... ఆచార్య
మూవీ ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఆచార్య సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
గేమ్ చేంజర్ అనే పాన్
ఇండియా మూవీ.లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు ఈ
సినిమా ఈ బ్యానర్ లో 50 వ
మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే
శంకర్ ప్రస్తుతం
గేమ్ చేంజర్
మూవీ తో పాటు
ఇండియన్ 2
మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
దానితో
శంకర్ కొన్ని రోజులు
గేమ్ చేంజర
మూవీ షూటింగ్ కు సమయానికి కేటాయిస్తే ... మరికొన్ని రోజులు
ఇండియన్ 2
మూవీ కి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
శంకర్ గేమ్ చేంజర్
మూవీ కి సంబంధించిన అదిరిపోయే విషయాన్ని చెప్పుకొచ్చాడు.
శంకర్ సోషల్
మీడియా వేదికగా తాజాగా
గేమ్ చేంజెర్
మూవీ కి సంబంధించిన పవర్ఫుల్ క్లైమాక్స్ షూటింగ్ ఈ రోజుతో పూర్తి అయ్యింది. దీనితో
ఇండియన్ 2
మూవీ పై తన ఫోకస్ ను షిఫ్ట్ చేస్తున్నాను అంటూ ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.