ఎవరే అతగాడు సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె కొన్ని రోజులు తమిళ్ ఇండస్ట్రీలో సైతం కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాతో మళ్ళీ తిరిగి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ప్రియమణి. ఈ సినిమాల తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకుంది. అలా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.
దాని అనంతరం కొద్ది రోజులు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ కొత్త హీరోయిన్స్ వస్తుండడంతో తన క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. అనంతరం ముస్తఫా రాజ్ అనే ఒక బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది ప్రియమణి. పెళ్లయిన తర్వాత కొద్ది రోజుల్లో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాని తర్వాత బుల్లితెరపై డీ జోడిలో జడ్జిగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని వెబ్ సిరీస్ లలో వాటితోపాటు కొన్ని సినిమాల్లో సైతం కీలకపాత్రలో నటిస్తూ కొనసాగుతోంది ఈమె. అయితే తరగతి నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించింది.
ఇక ఈ సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .అయితే కస్టడీ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రియమణికి ఒక సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్త విన్న అందరూ వారిద్దరి మధ్య ఇలాంటి సీక్రెట్ రిలేషన్ షిప్ ఉంది అంటూ ఆరా తీస్తున్నారు. అయితే ప్రేమనికి ఈ సినిమా డైరెక్టర్ వెంకట్రావుకి ఉన్న సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటి అంటే వెంకట్ ప్రభు సిస్టర్ ప్రియమణికి చాలా మంచి స్నేహితురాలట. ఆ కారణంగానే వెంకట్ ప్రభు ప్రియమణికి ఫ్రెండ్ అయ్యాడు. అంతేకాదు వెంకట్ ప్రభు ప్రియమణి కి ఇంతకుముందే మంచి పరిచయం పొందట..!!