టాలీవుడ్
ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న
యువ హీరోలలో
కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ
యువ నటుడు
రాజా వారు
రాణి గారు
మూవీ తో
హీరో గా
వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ
మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ మంచి విజయం సాధించడంతో ఈ
యువ హీరోకు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి
కిరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఈ
యువ నటుడు వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ లలో వినరో భాగ్యము విష్ణు కథ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... మీటర్
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
యువ కథానాయకుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డిజె టిల్లు ఫేమ్
నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రీతీనం
కృష్ణ ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ యూనిట్ తాజాగా ఈ
సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.