పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న మళ్ళీ పెళ్లి...!!
తెలుగు లో నరేష్ కి మంచి క్రేజ్ అయితే ఉంది. అలాగే కన్నడం లో పవిత్ర లోకేష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఈ సినిమా ను అక్కడ ఇక్కడ రెండు చోట్ల విడుదల చేయాలని భావించారట. కానీ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చామని తాజా ప్రెస్ మీట్ లో దర్శకుడు ఎంఎస్ రాజు పేర్కొన్నాడట.. హిందీ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా జరుగుతోంది.
అతి త్వరలోనే సినిమాను అక్కడ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. తెలుగు తో సమానంగా కాకుండా కాస్త అటు ఇటుగానే అక్కడ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం..ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఈ సినిమా రూపొందింది అని.. ఇది యూనివర్శిల్ సబ్జెక్ట్ వారు తెలిపారు.కనుక 600 భాషల్లో విడుదల చేసినా కూడా సక్సెస్ అవుతుంది అన్నట్లుగా నరేష్ కామెంట్స్ అయితే చేశాడు. పాన్ ఇండియా కథ మరియు కథనం తో వచ్చిన కొన్ని సినిమా లు ఉత్తర భారతంలో నిరాశ పర్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ను అక్కడ కావాలని విడుదల చేయడం లేదు. అక్కడి వారు కోరి మరీ విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారట.. కనుక అస్సలు ఏం జరుగుతుందో చూడాలి. నరేష్ మరియు పవిత్ర ల యొక్క ప్రేమ కథ గురించి తెలుగు మరియు కన్నడ వారికి అయితే బాగా తెలుసు. కనుక ఇక్కడ అక్కడ ఆడియెన్స్ ఈ సినిమా ని చూస్తారేమో కానీ హిందీ లో ఈ సినిమా ను అస్సలు పట్టించుకుంటారా లేదో చూడాలి.