ఈ ఫోటోలోని బుడ్డోడు.. తమిళ్లో స్టార్.. తెలుగులోను ఫాన్స్ ఉన్నారు?

praveen
సాధారణంగా సోషల్ మీడియాలో సినీ సెలెబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక వార్త తెరమీదకి వస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు కేవలం హీరోల హీరోల సినిమా అప్డేట్లు మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు సినీ సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తూ ఉంది. ఎప్పుడు సినిమా హీరో హీరోయిన్ల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేస్తూ ఉంటాయి. దీంతో ఇలా ఇప్పటి స్టార్ హీరోల ఒకప్పటి చైల్డ్హుడ్ ఫోటోలను గుర్తుపట్టడానికి అభిమానులు కొన్ని కొన్ని సార్లు తల పట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.



 ఇలా ఇటీవల కాలంలో తరచూ సినిమా హీరోలకు సంబంధించిన ఏదో ఒక త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటోనే ఒకటి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు తమిళ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటికే తమిళ్ హీరోలు ఎంతోమంది తెలుగులో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఇక అతగాడు కూడా ఇలాగే తమిళ్లో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ భారీగానే అభిమానులను సంపాదించుకున్నాడు.



 అతను నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఎప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ అతను ఎవరో గుర్తుపట్టారా.. ఎవరో కాదు తమిళ హీరో జీవ. రంగం, స్నేహితుడు లాంటి సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన జీవ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2003 సంవత్సరంలో ఆసాయ్  అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు జీవ. ఇక తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: