తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చిన దుల్కర్..!

shami
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. సితార బ్యానర్ తో పాటుగా ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తుంది. రీసెంట్ గా ధనుష్ సార్ తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దుల్కర్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. మహానటి, సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు నచ్చిన దుల్కర్ ఇక్కడ కూడా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటున్నాడు.
తెలుగు ఆడియన్స్ కి దుల్కర్ నచ్చేశాడు అందుకే అతని సినిమాలు ఆదరిస్తున్నారు. అంతేకాదు దుల్కర్ స్టోరీ సెలక్షన్ లో కూడా క్లవర్ అని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తెలుగులో చేసిన రెండు సినిమాలు వైజయంతి బ్యానర్ లోనివే.. లేటెస్ట్ గా సితార బ్యానర్ తో చేతులు కలిపాడు దుల్కర్. వెంకీకి ఆల్రెడీ హిట్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి దుల్కర్ కి కూడా అది కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంతకీ దుల్కర్ కోసం ఎలాంటి కథ చెప్పి వెంకీ ఒప్పించాడు అన్నది తెలియాల్సి ఉంది.
ఓ పక్క దుల్కర్ మలయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. అయితే మన మేకర్స్ దుల్కర్ ని తీసుకోవడం వెనక అసలు ట్విస్ట్ ఏంటంటే అతనితో చేసే ఇటు తెలుగుతో పాటుగా తమ్ళ, మలయాళ మార్కెట్ కూడా కవర్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే దుల్కర్ తో సినిమాలు చేస్తున్నారని టాక్. అంతేకాదు తెలుగు హీరోలంతా కూడా బిజీగా ఉండటం వల్ల కూడా దుల్కర్ లాంటి హీరోలకు ఇక్కడ ఛాన్స్ లు వస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా తెలుగులో దుల్కర్ స్టార్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలా సందేహం లేదు. మలయాళ హీరో కూడా తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అందుకే చిన్నగా వచ్చిన ప్రతి ఆఫర్ చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: