పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ అజ్ఞాతవాసి
మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పవన్ ...
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వకీల్ సాబ్
మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ
మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ
సినిమా తర్వాత భీమ్లా
నాయక్ మూవీ లో పవన్
హీరో గా నటించాడు. ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్
జోష్ లో ఉన్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి
మూవీ లలో
హీరో గా నటిస్తున్నాడు.
అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే "ఓజి"
మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పవన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాకు
టాలీవుడ్ యువ దర్శకులలో ఒకరు అయినటువంటి
సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
ప్రియాంక అరుల్
మోహన్ ఈ సినిమాలో పవన్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ లో
ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత డి
వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం పవన్ ...
ప్రియాంక లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ మే 17వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు అని వార్తలు రావడంతో ఈ మూవీ.పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.