బాలీవుడ్ హీరోలతో ప్రేమయణాలు.. రష్మీక..!!

Divya
టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో సైతం తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పాటు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.రష్మిక అందానికి సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇండియన్ క్రికెటర్లుకు సైతం రష్మికకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇదంతా ఇలా ఉంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమె నటించిన చిత్రాలకు పెద్దగా క్రేజ్ కనిపించలేదు.

గతంలో మాదిరిగా తన హవా చూపించలేకపోతోంది ఇప్పుడు పూర్తిగా సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నప్పటికీ.. ఈమె చేతిలో పుష్ప-2 , రెయిన్బో, యానిమల్ వంటి చిత్రాలలో నటిస్తోంది ఈ మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ మూవీస్ కావడం గమనార్హం రెయిన్బో లేడీ ఓరియంటెడ్ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు చిత్రాల పోయిన రష్మిక అభిమానులు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు తాజాగా రష్మిక గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే తెలుగు హీరోలతో ప్రేమాయణం చాలదని హిందీ హీరోలతో కూడా ప్రేమాయణం నడుపుతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా నిజజీవితంలో కాదు సినిమాల్లో అంటూ సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు ఏక్తా కపూర్ కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ మీద చర్చలు జరుగుతున్నాయి.పలువురు పేర్లు ప్రస్తావన రాగా మేకర్స్ రష్మిక పేరును ఓకే చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఇప్పటికే రష్మిక తో కలిసి రెండు సినిమాలు చేశారు అందులో ఒకటి గుడ్ బై కాక మరొకటి వారిసు ఈ రెండు సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో కుర్రకారులను మరింత ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: