సినిమా ఓకే చేయాలంటే.. సంయుక్త రెండు కండిషన్లు పెడుతుందట తెలుసా?
దీంతో ఇక సంయుక్త మీనన్ ను సినిమాలో పెట్టుకున్నామంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని దర్శక నిర్మాతలు కూడా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇక సంయుక్తకి లక్కీ హీరోయిన్ అని ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు. ఇక ఈ ట్యాగ్ తోనే ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే వరుసగా విజయాలు వస్తే ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పెంచడం సర్వసాధారణం. ఇక ఇప్పుడు సంయుక్త కూడా తానేమి ఇందుకు అతీతం కాదు అంటూ చెబుతుంది. ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట సంయుక్త మీనన్.
ఇక తాను అడిగినంత ఇస్తేనే సినిమాలో నటిస్తానని డిమాండ్ పెడుతుండట. అంతేకాదు కథలో తన పాత్ర చాలా కీలకంగా ఉండాలని.. అలా అయితేనే ఇక సినిమాలో నటిస్తానని ఇలా రెండు కండిషన్స్ పెడుతుందట సంయుక్త. ఇక ఈ రెండిటిలో ఏది తగ్గినా కూడా సినిమా చేయను అని ముఖం మీద చెప్పేస్తుందట. ఇకపోతే ప్రస్తుతం సంయుక్త మీనన్ జోరు చూస్తూ ఉంటే మరికొన్ని రోజుల్లో ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లేలాగే కనిపిస్తూ ఉంది. మరి సంయుక్త మీనన్ హిట్ మేనియా ఇండస్ట్రీలో ఎన్నాళ్లు కొనసాగుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏదేమైనా ఈ యంగ్ హీరోయిన్ రాకతో కొంతమంది స్టార్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి.