టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయాలనుంది.. విజయ్ ఆంటోని..!!

Divya
నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు-2 ఈ చిత్రం ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విజయ్ ఆంటోని దర్శకత్వంలోనే తెరకెక్కించడం జరుగుతోంది .ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ నిర్వహించిన ఒక ఈవెంట్లో పాల్గొని అభిమానులతో ఈయన ముచ్చటించడం జరిగింది.. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు సీక్వెల్ సినిమా మీరు కాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటుందని ప్రశ్న ఎదురుగా.. అందుకు విజయ్ ఆంటోని మహేష్ బాబు కైతే బాగా సూట్ అవుతుందని తెలిపారు. తమిళంలో అయితే ఈ చిత్రాన్ని అజిత్ గాని విజయ్ గాని అయితే సూట్ అవుతారని తెలిపారు.. తాను నటించిన బిచ్చగాడు -2 హీరో పాత్ర బిచ్చగాడు కావడం వల్లే ఈ సినిమాకి బిచ్చగాడు-2 అని పెట్టాము 2016 లో విడుదలైన బిచ్చగాడు సినిమా కథకు ఈ సినిమా సీక్వెల్ కాదు ఈ రెండు కథలకు అసలు సంబంధమే ఉండదని తెలిపారు.

వ్యక్తిగతంగా నేను చాలా సున్నిత మనసు గల వ్యక్తిని అందుకే సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలను రాస్తూ ఉంటానని తెలిపారు.. అయితే ఒక దర్శకుడిగా చూస్తే నేను అంత గొప్ప నటుడిని కాదని తెలిపారు తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బిచ్చగాడు ఘనవిజయాన్ని అందుకుంది.. మరి బిచ్చగాడు-2 చిత్రం అన్నాచెల్లెళ్ల సెంటిమెంటు ఉంటుందా తెలిపారు. టాలీవుడ్లో హీరో మహేష్ బాబుతో ఒక సినిమా డైరెక్షన్ చేయాలని ఉందంటు కూడా తెలియజేయడం జరిగింది విజయ్ ఆంటోని. బిచ్చగాడు -2 చిత్రం కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కించాలని తెలిపారు విజయ్ ఆంటోనీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: