తనకి అవకాశాలు రాకపోవడం పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మీ....!!
జబర్దస్త్ కారణంగా భారీ పాపులారిటీ సంపాదించిన వారిలో యాంకర్ రష్మీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ షోతోనే ఆమెకు పాపులారిటీ లభించింది. బుల్లితెరపై తెగ హంగామా చేస్తూ తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్.
లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై హవా నడుస్తోంది యాంకర్ రష్మీ. వేదికపై తనదైన స్టైల్ హోస్టింగ్ చేస్తూ నవ్వుల రైడ్ లో భాగమవుతోంది. ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్తగా కనిపించినేందుకు ప్రయత్నిస్తుంటుంది రష్మీ.
ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న రష్మీ.. అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపనీ ప్రోమోలో రష్మీ చెప్పిన కొన్ని విషయాలు జనాల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ రష్మీని ఇంద్రజ ప్రశ్నిస్తూ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించిన నువ్వు వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయావు అని ప్రశ్నించారు. దీనిపై రష్మి రియాక్ట్ అవుతూ.. సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వచ్చాయి. అయితే రాత్రికి రాత్రే తన పాత్రలో ఇతరులు వస్తున్నారని చెప్పింది.
ఇలా తాను ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయానని తెలిపారు యాంకర్ రష్మీ. సాధారణంగా ఇండస్ట్రీలో అందరికీ ఒక స్టాంపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ గా, ఇంకొందరు అక్క వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారనే స్టాంప్ ఉంటుంది. అలాగే.. నేను సినిమాలలోకి పనికిరానని కేవలం యాంకర్ గా మాత్రమే తాను సెట్ అవుతాననే స్టాంపు ఉండటం వల్లనే సినిమా అవకాశాలు రావడం లేదని చెప్పింది.
తనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిన టెలివిజన్ రంగాన్ని మాత్రం తాను ఎప్పటికీ వదులుకోనని ఈ సందర్భంగా రష్మి వెల్లడించింది. దీంతో రష్మీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ ఉంది. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో వచ్చిన ఫేమ్‌ని గట్టిగా క్యాష్ చేసుకుంటోంది రష్మీ. పలు స్పెషల్ షోస్ కూడా చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తోంది.
రష్మీ గౌతమ్ ఓ మనసున్న మంచి మనిషి అని మనందరికీ తెలిసిన విషయమే. జంతు ప్రేమికురాలిగా కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది రష్మీ. ఈ భూమ్మీది ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ అయి దాన్ని ఖండించడం రష్మీ నైజం.