అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!

shami
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లీడ్ రోల్స్ లో నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అన్నీ మంచి శకునములే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం 23 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు టాక్. హీరో హీరోయిన్ కాస్టింగ్ తక్కువలో వచ్చినా మిగతా స్టార్ కాస్ట్ అంతా పెద్దది కావడంతో వారంతటిని ఆ లొకేషన్ కి తీసుకెళ్లి షూటింగ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిందట. అంతేకాదు సినిమా కోసం సెట్ వర్క్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది.
పాతిక కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అంతగా జరగలేదట. కానీ అన్నీ మంచి శకునములే మంచి లాభాలే తెచ్చి పెట్టిందని అంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ కాకుండానే ఈ సినిమాకు 21 కోట్ల దాకా డిజిటల్ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని టాక్. అంటే సినిమా బడ్జెట్ లో మ్యాక్సిమం డిజిటల్ శాటిలైట్ రైట్స్ తోనే వచ్చేశాయి. మరోపక్క ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ కింద కూడా కొంత మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది.
సో ఎలా చూసినా థియేట్రికల్ బిజినెస్ తో సంబంధం లేకుండానే అన్నీ మంచి శకునములే సినిమాకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తున్న సంతోష్ శోభన్ ఆ సినిమాలతో ఫెయిల్యూర్స్ అందుకున్నాడు. కానీ అన్నీ మంచి శకునములేతో తన ఫేట్ మారుతుందని భావిస్తున్నాడు. ఇక ఈరోజు రిలీజైన అన్నీ మంచి శకునములే సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చినా స్లో నరేషన్ వల్ల బ్యాలెన్స్ తప్పిందని అంటున్నారు. ఫైనల్ టాక్ ఏంటి వసూళ్లు ఎలా ఉన్నాయన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. తప్పకుండా సినిమా అయితే ఈ సమ్మర్ కి చల్ల చల్లని గాలిగా ఉంటుందని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: