రామాబాణానికి బలి కాకుండా తప్పించుకున్నారు సీనియర్ హీరో....!!
అయితే ఇటీవల ఆయన నటించిన రామభాణం సినిమా రిలీజ్ అయింది.
గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సక్సెస్ సాధించగా రామబాణం సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.అయితే ఈ సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్ర కోసం మొదట రాజశేఖర్ ను సంప్రదించగా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజశేఖర్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నారు.
అయితే రాజశేఖర్ ఈ సినిమా రిజల్ట్ ను ముందుగానే ఊహించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అందువల్లే ఈ సినిమాను ఆయన రిజెక్ట్ చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రాజశేఖర్ ఈ మధ్య కాలంలో యాక్టింగ్ కు దూరంగా ఉంటున్నారు.రాజశేఖర్ గత సినిమా శేఖర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.రామబాణం తరహా సినిమా కథలను ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూసేశారు.
రామబాణం రొటీన్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గోపీచంద్ కథల ఎంపికలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నాడని కొంతమంది చెబుతున్నారు.
కథల ఎంపికలో పొరపాట్లను ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం గోపీచంద్ కు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందులు తప్పవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.గోపీచంద్ కథల ఎంపికలో మారడంతో పాటు కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.
గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటారనే సంగతి సంగతి తెలిసిందే.
అయితే ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేదు.గోపీచంద్ శ్రీవాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.గోపీచంద్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోకపోతే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది.
గోపీచంద్ కెరీర్ కు సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.గోపీచంద్ ఇతర నటులకు భిన్నంగా కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు.మొత్తానికి అయితే రాజశేఖర్ చాలా తెలివిగా ఆలోచించి ఒక ప్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి.