తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సంపాదించుకున్న ఈయన తెలుగులో సైతం అంతే అభిమానాన్ని దక్కించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాకుండా ఆయన కొత్త సినిమాల కోసం టాలీవుడ్ సినీ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన వారసుడు సినిమాతో దక్షిణాది సినీ ఇండస్ట్రీకి నేరుగా పరిచయం అయ్యాడు విజయ దళపతి. తాజాగా ఇప్పుడు మరోసారి లియో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
లోకేష్ కనకరాజు దర్శనత్వంలో విజయ్ దళపతి హీరోగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష విజయ్ సరసన నటించబోతోంది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. విజయ్ ప్రస్తుతం ఒకవైపు లియో సినిమా షూటింగ్లో పాల్గొంటూనే తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఆయన గురించి ఒక కొత్త అప్డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది.ఇక నాగచైతన్య కృతి శెట్టి నటించిన కస్టడీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాతో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ దళపతి తన నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభు తో ఉండబోతుందట. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇంత భారీ మొత్తంలో పారితోషకం తీసుకునేది విజయ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈ సినిమా లాభంలో సైతం విజయ్ కి షేర్ సైతం బాగా వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం విజయ్ ఒక సినిమాకి గాను 100 కోట్లకు పైగా రెమిడీషను తీసుకుంటున్నాడు. ఇక దేశవ్యాప్తంగా ప్లాన్ ఇండియా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన 150 కోట్లు ఇవ్వడం కాదు..!!