ప్రభాస్ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకున్న హీరోయిన్..!

shami
ప్రభాస్ తో జత కట్టడం అంటే కెరీర్ సెట్ అయినట్టే లెక్క. ప్రస్తుతం ఈ లిస్ట్ లో మలయాళ భామ మాళవిక ఉంది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాలో అమ్మడు హీరోయిన్ గా చేస్తుంది. కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో మాళవిక పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుతుంది. లేటెస్ట్ గా తన ఫాలోవర్స్ తో స్పెషల్ క్వశ్చన్ అవర్ జరిపిన మాళవికకు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి.
అయితే తను అనంటికీ ఓపికగా సమాధానం చెప్పింది అయితే ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారని ఒక అభిమాని అడిగితే చరిష్మాటిక్ అనేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి ఉన్న ఛరిష్మా మరే హీరోకి లేదు. ఆ రేంజ్ మెయింటైన్ చేస్తూ ప్రభాస్ తన స్టార్ డం ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభాస్ ఆదిపురుష్, సలార్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే కచ్చితంగా అప్పుడు నేషనల్ వైడ్ గా ప్రభాస్ మరోసారి ట్రెండింగ్ లో ఉండే అవకాశం ఉంది.
ప్రభాస్ తో మాళవిక రొమాన్స్ మారుతి సినిమా లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు మాళవిక చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. మాళవిక ఈ సినిమా తర్వాత తన రేంజ్ పెరుగుతుందని ముందే ఊహించింది అందుకే ప్రభాస్ సినిమా ఓకే చేశాక యువ హీరోల సినిమా ఛాన్స్ లు వచ్చినా నో చెప్పేసింది. మొత్తానికి అమ్మడు ప్లానింగ్ చూస్తే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. విజయ్ మాస్టర్ తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన మాళవిక ప్రభాస్ సినిమాతో డైరెక్ట్ గా ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: