HBD: J.R. ఎన్టీఆర్ నంది అవార్డు ఏ చిత్రానికి అందుకున్నారంటే..?

Divya
ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే . తన 40వ పుట్టినరోజు ఈరోజు. దీంతో ఎన్టీఆర్ కు సంబంధించి పలు విషయాలను అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా నటనలో డాన్సులు డైలాగు చెప్పడంలో అదుర్స్ అనిపిస్తూ ఉంటాడు ఎన్టీఆర్. ఇలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో కీలకమైన ఘట్టాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పటివరకు 29 సినిమాలు చేశారు 30వ సినిమా డైరెక్టర్ కొరటాల శివ తో చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా రెండు సినిమాలలో నటించారు. చిన్న వయసులోనే రామాయణంలో రాముడి పాత్రలో అలరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్రలు భరతుడి పాత్రలో నటించారు కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఎన్టీఆర్ పాత డిమాండ్ చేసిందంటే సిక్స్ ప్యాక్ చేయడానికి కూడా తయారయ్యారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఎన్టీఆర్ సరికొత్త పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. 1997లో అంతా చిన్నపిల్లలతో తెరకెక్కించిన రామాయణం చిత్రంలో బాలరాముడిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమాతోనే మొదటిసారి నంది అవార్డును అందుకున్నాడు ఎన్టీఆర్. 2001లో ఉషా కిరణ్ మూవీస్ వారు నిన్ను చూడాలని ఉంది చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అలాంటి సమయంలోనే రాజమౌళితో పరిచయం ఏర్పడి వీరి కలయికలు వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది.

ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోని డైలాగులు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. దీంతో మాస్ హీరోగా కూడా పేరు సంపాదించారు. రాజమౌళి డైరెక్షన్లో సింహాద్రి సినిమా విడుదల కానుక సరికొత్త రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాతో మరొక కొత్త కోణాన్ని చూపించారు ఎన్టీఆర్. ఇదే కాకుండా మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: